టెలికం రంగంలో పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ఎయిర్టెల్, వొడాఫోన్ లక్షల్లో కస్టమర్లను కోల్పోతే జియో అంతే వేగంగా కొత్త కస్టమర్లను యాడ్ చేసుకోగలిగింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) లేటెస్ట్గా మార్చి నెల రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలేమిటో చూడండి.
75 లక్షల మంది కస్టమర్లను కోల్పోయిన ఎయిర్టెల్, వొడాఫోన్
* మార్చి నెలలో వొడాఫోన్, ఎయిర్టెల్ కలిసి ఏకంగా 75 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. ఇందులో ఎయిర్టెల్ వాటా 12 లక్షలు. ఇక వొడాఫోన్ అయితే ఒక్క నెలలోనే 63 లక్షల మంది వినియోగదారులను పోగొట్టుకుంది.
*జియో ఇదే నెలలో కొత్తగా 46 లక్షల మంది కస్టమర్లను యాడ్ చేసుకోగలిగింది.
* ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 96 వేల మంది కస్టమర్లను మార్చిలో యాడ్ చేసుకోగలిగింది.
మార్కెట్లో ఎవరి వాటా ఎంత?
1. జియో 33.47% (38.7 కోట్లు)
2. ఎయిర్టెల్ 23.81% (32.7 కోట్లు)
3. వొడాఫోన్ ఐడియా 27.57 (31.9 కోట్లు)
4. బీఎస్ఎన్ఎల్ 10.35% (11.9 కోట్లు)
5. ఎంటీఎన్ఎల్ 0.29% (33.6 లక్షలు)
జియో హ‌వా à°Ÿà±à°°à°¾à°¯à± మారà±à°šà°¿ రిపోరà±à°Ÿà±â€Œ Jio Customers Jio On top